Top
logo

పింఛన్‌దారులకు గుడ్ న్యూస్

X
Highlights

పేదల పింఛన్ లను మళ్లీ పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. పింఛన్ ఎంతో మ్యానిఫెస్టో కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని...

పేదల పింఛన్ లను మళ్లీ పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. పింఛన్ ఎంతో మ్యానిఫెస్టో కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న 200రూపాయిల పింఛన్ ను వెయ్యికి పెంచిన ఘనత తమదేనన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం.. గత ప్రభుత్వాల హయాంలో ముసలివాళ్లను, వికలాంగులను చూసేవాల్లు లేరు. బీడీ కార్మికులను ఆదుకునే వారు లేరు. రూ. 42 వేల కోట్ల ఖర్చు పెట్టి.. 200 ఉన్న పెన్షన్‌ను వెయ్యికి తీసుకుపోయాము. కాంగ్రెస్ అరాజ్ పాడినట్టు నువ్వు 1000 ఇస్తావా.. మేము 2000 ఇస్తాం. నేను 2200 ఇస్తామంటే మీరేం చేస్తారు. తెలంగాణ విప్లవం పుట్టకపోతే మీరు 2000 అందురా. పేదలపై మీకు కనువిప్పు కలిగినందుకు సంతోషపడుతున్నా. పెన్షన్ పెంచబోతున్నాం. త్వరలోనే మేనిఫెస్టోను విడుదల చేసి చెబుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Next Story