రేవంత్ రెడ్డి విషయంలో అందరూ ఊహించిందే జరిగింది

రేవంత్ రెడ్డి విషయంలో అందరూ ఊహించిందే జరిగింది
x
Highlights

ఐదేళ్ల శాసనసభను నాలుగు సంవత్సరాల మూడునెలలకె రద్దు చేశారు కేసీఆర్. దాంతో ముందస్తు ఎన్నికలు వెళుతున్నారు. ఈ క్రమంలో తెరాసలో దాదాపు సీట్ల కేటాయింపు...

ఐదేళ్ల శాసనసభను నాలుగు సంవత్సరాల మూడునెలలకె రద్దు చేశారు కేసీఆర్. దాంతో ముందస్తు ఎన్నికలు వెళుతున్నారు. ఈ క్రమంలో తెరాసలో దాదాపు సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయింది. అందులో భాగంగా తొలి విడతలో 105 మందికి టికెట్లు కేటాయించారు కేసీఆర్. వారిలో అన్నదమ్ములకు కూడా టిక్కెట్లు కేటాయింపు జరిగింది. ప్రభుత్వానికి కంటిలో నలుసులా ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో తాజా మాజీ మంత్రి (ప్రభుత్వం అధికారికంగా రద్దయితే) పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేంద్రరెడ్డిని కొడంగల్ బరిలో దింపింది. వ్యక్తిగతంగాను, పార్టీ పరంగాను మంచి పట్టు ఉన్న రేవంత్ రెడ్డిని ఓడించాలంటే.. అంగబలం అర్ధబలం మెండుగా ఉన్న నరేంద్రరెడ్డి అయితేనే బాగుంటుందని కేసీఆర్ భావించారు. దాంతో కొడంగల్ జనాలు కూడా ఆయనే అభ్యర్థి అని ఫిక్స్ అయ్యారు. తాజాగా నరేంద్రరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories