logo
ఆంధ్రప్రదేశ్

ఇవాళ అనంతపురంలో ముఖ్యమంత్రి పర్యటన

ఇవాళ అనంతపురంలో ముఖ్యమంత్రి పర్యటన
X
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ అనంతపురంలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ అనంతపురంలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.30 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.అనంతరం అక్కడినుంచి హెలికాప్టర్‌లో గుమ్మగట్ట మండలం బైరవాని తిప్ప ప్రాజెక్టుకు చేరుకుంటారు. 960 కోట్ల రూపాయల వ్యయంతో.. కృష్ణా జలలాలను జీడిపల్లి రిజర్వాయర నుంచి బైరవాని తిప్ప ప్రాజెక్టుకు తరలించేందుకు నిర్మిస్తున్న కాలువ పనులకు శంకుస్దాపన చేస్తారు. ముందుగా బైరవాని తిప్పకు చేరుకున్న తరువాత పైలాన్ ప్రారంభిస్తారు. ఆ తరువాత లక్ష పారం పాండ్లను తవ్విన ప్రదేశాన్ని పరిశీలిస్తారు. తరువాత.. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కళ్యాణదుర్గం మండలం గరుడాపురం చేరుకుని 3 గంటలకు కాలువల పనులకు భూమి పూజ చేస్తారు.. తరువాత అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.. సభ అనంతరం సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను, పరికరాలను ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు.

Next Story