దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నా...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నా...
x
Highlights

నేడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైయస్ ఆత్మకు శాంతి చేకూరాలని...

నేడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైయస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ ,మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో 'మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు సీఎం చంద్రబాబునాయుడు. అలాగే ఇడుపులపాయలో వైయస్ కుటుంబసభ్యులు ఘనంగా వైయస్ నివాళి అర్పించారు. ఇటు విశాఖలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న ప్రతిపక్షనేత వైయస్ జగన్ తండ్రిని స్మరించుకున్నారు. ‘వర్ధంతి సందర్భంగా నాన్నను గుర్తుచేసుకుంటున్నాను. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories