2019 ఫ్రిబ్రవరి నాటికి వెలిగొండ పూర్తిచేసి నీరిస్తాం : సీఎం చంద్రబాబు

2019 ఫ్రిబ్రవరి నాటికి వెలిగొండ పూర్తిచేసి నీరిస్తాం : సీఎం చంద్రబాబు
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు, రేపు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను అయన...

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు, రేపు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను అయన పరిశీలించారు. ప్రాజెక్టు ఒకటవ సొరంగం పనులను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి నీరు అందిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పనులను ఆయన పరిశీలించారు. మొదటి సొరంగం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి కాకపోతే లిఫ్ట్ ద్వారా అయినా నీరు ఇస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల వల్ల పనులు జాప్యం జరిగాయని పేర్కొంటూ.. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లను మార్చామని ఇకపై పనులు శరవేగంగా జరుగుతాయని అన్నారు. కాగా సీఎం వెంట భారీ ఈటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, నేతలు మన్నే రవీంద్ర మార్కాపురం మాజీ కందుల నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories