జగన్ ను ఒంటరి చేసేశారుగా!

జగన్ ను ఒంటరి చేసేశారుగా!
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు చాలా తెలివిగా ఎత్తుగడ వేశారు. కేంద్రంపై అవిశ్వాసం పెడతాం.. మద్దతివ్వండి అంటూ.. మొదటి నుంచి ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్న...

ఏపీ సీఎం చంద్రబాబు చాలా తెలివిగా ఎత్తుగడ వేశారు. కేంద్రంపై అవిశ్వాసం పెడతాం.. మద్దతివ్వండి అంటూ.. మొదటి నుంచి ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ను.. ఒకే ఒక్క నిర్ణయంతో ఇరుకున పెట్టేశారు. వైసీపీ పెట్టే అవిశ్వాసానికి తాము మద్దతు ఇవ్వడం కాదు.. తామే అవిశ్వాసం పెట్టి ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అనూహ్య చర్యకు పూనుకున్నారు.

అనుకున్నదే తడవుగా.. పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టేశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ లాంటి ప్రముఖ పార్టీల మద్దతు కూడగట్టినట్టుగా కూడా చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తున్న పరిస్థితుల్లో జగన్ ఒంటరి వాడయ్యారనే చెప్పక తప్పని పరిస్థితిని కల్పిండచంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. నిన్న ఇచ్చిన అవిశ్వాసం చర్చకు రాకపోవడంతో.. మరోసారి ఎల్లుండి అవిశ్వాస తీర్మానం పెడతామని నోటీసులు కూడా ఇచ్చింది. అనుకున్న మద్దతు కూడా సంపాదించింది కాబట్టి.. తీర్మానానికి ఇబ్బంది కూడా ఉండదు.

కానీ.. కేంద్రం మాత్రం.. అటు వైసీపీ, ఇటు టీడీపీ.. రెండు పార్టీలూ పెడుతున్న అవిశ్వాసాలపై జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఎవరు అవిశ్వాసం పెట్టినా.. చర్చకు అవకాశం రాకుండా జాగ్రత్త పడుతోంది. కొన్ని రోజుల్లో సమావేశాలు ముగుస్తున్న తరుణంలో.. ఇతర సమస్యలపై పార్లమెంట్ స్తంభిస్తున్న తీరును చూస్తుంటే.. కొన్ని పార్టీలకు ఇదే అనుమానం కలుగుతోంది. ఎల్లుండి టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానం తర్వాత ఏర్పడే పరిస్థితులతో.. కేంద్రం వైఖరి ఎలాంటిదో తేలిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories