ఎంపీలతో సీఎం టెలీకాన్ఫరెన్స్.. ఇలా చేయండి..

ఎంపీలతో సీఎం టెలీకాన్ఫరెన్స్.. ఇలా చేయండి..
x
Highlights

పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబు ఎంపీలు, సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మీ పోరాటం భావి తరాల...

పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబు ఎంపీలు, సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మీ పోరాటం భావి తరాల కోసమేనన్న విషయం అందరికీ స్పష్టం కావాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సభ నుంచి సస్పెండ్ చేసినా.. ఎలాంటి పరిణామాలు ఎదురైనా వెనుకంజ వేయొద్దని.. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై సమాచారాన్ని ఎంపీలకు ఇవ్వాలని ఆయన సీనియర్ మంత్రులకు ఆదేశించారు. చట్టంలో ఏం చేస్తామన్నారు? నాలుగేళ్లలో ఏం చేశారు? అన్నది లెక్కలతో సహా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. ఇక టీడీపీ ఎంపీలకు సమగ్ర సమాచారం అందించేందుకు ఆర్థికమంత్రి యనమలను ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories