కేసీఆర్ గిఫ్ట్ తీసుకోవాలా.. వద్దా..

కేసీఆర్ గిఫ్ట్ తీసుకోవాలా.. వద్దా..
x
Highlights

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం తరువాత సిఎం కెసిఆర్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎపీ సిఎం చంద్రబాబునాయుడుకు తప్పకుండా...

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం తరువాత సిఎం కెసిఆర్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎపీ సిఎం చంద్రబాబునాయుడుకు తప్పకుండా రిటర్న గిఫ్ట్ ఇస్తానని కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే అయితే ఈ విషయంపై మరోసారి సిఎం చంద్రబాబు స్పందిస్తూ తెలంగాణ సిఎం కెసిఆర్ గిఫ్ట్ తీసుకోవాలా. వద్దా తమ్ముళ్లూ అని శ్రీకాకుళంలో ధర్మపోరాట సభలో సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఎవరిని బెదిరిస్తున్నారని అని విమర్శించారు. మీరాంతా కొండంతా అండాగా ఉన్నంతవరకు ఏ కొండనైనా ఢీకొడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. మన రాష్ట్రంకోసం కష్టపడడి సంపద సృష్టిస్తా కాని అవమానాన్ని సహించనని సిఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories