తొలి శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

x
Highlights

ఏపీ విభజన తర్వాతి పరిస్థితులు, విభజన హామీలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు ఒక్కొక్క అంశంపై శ్వేత పత్రం విడుదల...

ఏపీ విభజన తర్వాతి పరిస్థితులు, విభజన హామీలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు ఒక్కొక్క అంశంపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. అమరావతిలో తొలి శ్వేత పత్రం విడుదల చేసిన చంద్రబాబు విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గత నాలుగున్నర ఏళ్లలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏవిధంగా ఇబ్బందిపెట్టిందో తెలియజేయడానికే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. విభజనకు ముందు ప్రత్యేకహోదా ఇస్తమన్న బీజేపీనే, ఇప్పుడు దాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటున్నది బీజేపి పార్టీయేనని చంద్రబాబు ధ్వజమేత్తారు. రాజకీయాల్లో ఇంతకంటే దివాళాకోరుతనం ఇంకిటి ఉండదని ఏపీ సిఎం చంద్రబాబు మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories