చేతనైతే సాయం చేయండి.. రెచ్చగొట్టొద్దు : సీఎం చంద్రబాబు

చేతనైతే సాయం చేయండి.. రెచ్చగొట్టొద్దు : సీఎం చంద్రబాబు
x
Highlights

శ్రీకాకుళంలో అధికారులంతా తుఫాను బాధితులకోసం రేయింబవళ్లు శ్రమిస్తుంటే కొందరు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు....

శ్రీకాకుళంలో అధికారులంతా తుఫాను బాధితులకోసం రేయింబవళ్లు శ్రమిస్తుంటే కొందరు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సహాయకచర్యలకు ఆటంకాలు కల్పిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చేతనైతే సాయం చేయ్యాలని..అంతేగాని రెచ్చగొట్టి అడ్డంకులు కల్పించవద్దని సూచించారు. లేనిపోని వదంతులు వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చగొట్టవద్దని సీఎం వార్నింగ్‌ ఇచ్చారు.

కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, టెక్కలి మండలాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం ... శ్రీకాకుళానికి పోటీగా టెక్కలి బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. బొప్పాయిపురం వద్ద అండర్ పాస్‌ను నిర్మిస్తామని తెలిపారు. తుఫాను వల్ల చాలా నష్టపోయారని..ఆందోళన చెందవద్దని, బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బొప్పాయిపురం గ్రామస్థులకు సీఎం చంద్రబాబు అభయమిచ్చారు.

టిట్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడి, మామిడి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో చాలా గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది విద్యుత్, రోడ్లు సహా పలు మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లాలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories