నేడు వేమన వర్సిటీలో జ్ఞానభేరి

నేడు వేమన వర్సిటీలో జ్ఞానభేరి
x
Highlights

యువ ఆలోచన నవ ఆవిష్కరణలకు జీవం పోసి విద్యార్థుల సమర్థతను వెలికితీసే జ్ఞానభేరి కార్యక్రమానికి కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వేదిక అయింది. ఇవాళ...

యువ ఆలోచన నవ ఆవిష్కరణలకు జీవం పోసి విద్యార్థుల సమర్థతను వెలికితీసే జ్ఞానభేరి కార్యక్రమానికి కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వేదిక అయింది. ఇవాళ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు విచ్చేస్తున్నారు. 7 అంశాలపై విద్యార్థులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందిస్తారు. మూడు గంటల పాటు సీఎం పర్యటన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని 142 కళాశాలల నుంచి 22 వేల మంది విద్యార్థులతో పాటు 1,647 మంది ఫ్యాకల్టీ హాజరవుతున్నారు. రాష్ర్టానికి అవసరమైన ఇంజనీరింగ్‌, సైన్స్‌, వ్యవసాయం, పశుసంవర్ధక, వైద్య, ఆరోగ్యం, ఆర్ట్స్‌ అండ్‌ లా, జనరల్‌ ఇలా 7 అంశాలపై విద్యార్థులతో చర్చలు నిర్వహించి 21 మంది విజేతలకు బహుమతులు అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories