Top
logo

మట్టి గణపతికే పెద్ద పీట.. వెరైటీ సెట్టింగులతో రెడీ అవుతున్న మండపాలు

Highlights

భాగ్యనగరంలో గణనాథుల సందడి మొదలైంది. చవతి రోజు పూజలందుకోవడానికి బొజ్జ గణపతి విగ్రహాలు మండపాల్లో కొలువు...

భాగ్యనగరంలో గణనాథుల సందడి మొదలైంది. చవతి రోజు పూజలందుకోవడానికి బొజ్జ గణపతి విగ్రహాలు మండపాల్లో కొలువు తీరుతున్నారు. వినాయక మండపాలు కొత్తకొత్త రీతుల్లో ముస్తాబవుతుంటే..
ఈసారి మట్టి గణపతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

వినాయక చవితి సందడి జంటనగరాల్లో వీధి వీధినా మొదలైంది. గణపతి పండగకి రెండే రోజులుండడంతో శరవేగంగా మండపాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈసారి గణపతి ఉత్సవ కమిటీలు సెట్టింగులకు
ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. మోడర్న్‌ సెట్టింగులతో మండపాలను తీర్చి దిద్దుతున్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణా వ్యాప్తంగా మట్టి గణపతులపై ప్రభుత్వం, జీహెచ్‌ఎమ్‌సీ చేసిన ప్రచారం సత్ఫలితాలిస్తోంది. మట్టి గణపతికే ఉత్సవ కమిటీలు మొగ్గు చూపుతుండడంతో ఈసారి పర్యావరణ వినాయక చవితి జరుగుతున్నట్లే భావించాలి.

Next Story