రేవంతా మ‌జాకా

రేవంతా మ‌జాకా
x
Highlights

ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీని ఢికొట్టడానికి తన బలాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రోత్సహిస్తోంది. ఇందులో బాగంగానే...

ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీని ఢికొట్టడానికి తన బలాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రోత్సహిస్తోంది. ఇందులో బాగంగానే ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకు పార్టీ కండువా కప్పి గాంధిభవన్ కు స్వాగతం పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి టీమ్ కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి హస్తం పార్టీ వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇప్పుడు అదే సమస్యగా మారింది.

2019 ఎన్నికలే టార్గెట్ గా దూసుకుపోతున్న టీ కాంగ్రెస్ ప్రజల్లో పేరున్న నేతలపై కన్నేసింది. ఇటీవల టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితో పాటు 8మంది మాజీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జానార్దన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి కసరత్తు జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అదే అంశం తెలంగాణ కాంగ్రేస్ లో చిచ్చు రేపుతోంది. నాగంను మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీసుకువస్తున్నారని భావిస్తున్న పార్టీలోని మరో వర్గం దీనిపై మండిపడుతోంది. ప్రధానంగా మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పంచాయితీ ఢిల్లీ దాక చేరింది.

ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్ గా ఉన్న మాజీ కేంద్ర‌మంత్రి జైపాల్ రెడ్డి ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో జిల్లాలో ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారు. డికే అరుణ ప్ర‌భాల్యాన్ని త‌గ్గించెంద‌కు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకువ‌చ్చర‌నే చర్చ జరుగుతోంది. డికే అరు, రేవంత్ రెడ్డి మ‌ధ్య గ్రూపు రాజ‌కీయం న‌డుస్తుండ‌గానే నాగం జ‌నార్ద‌న్ రెడ్డిని పార్టీలోకి తీసుకువ‌చ్చి డికే అరుణ‌కి చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు.

కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఎంట్రీని డైరెక్టుగా వ్య‌తిరేకించ‌క‌పోయిన ఇంట‌ర్న‌ల్ గా మాత్రం డికే అరుణ వ‌ర్గీయులు త‌ప్పుబ‌ట్టారు. ఢీల్లి స్థాయిలో ప‌లుకుబ‌డి ఉన్న జైపాల్ రెడ్డి మాత్రం టీపీసీసీ ఛీప్ ఉత్త‌మ్ ను ముందుంచి రేవంత్ ని పార్టీలోకి తీసుకువ‌చ్చారనే వాదన ఉంది. ఇప్పుడు బీజేపీ సీనియ‌ర్ నేత నాగంని హ‌స్తం పార్టీలోకి తీసుకువ‌చ్చెంద‌కు ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి. నేరుగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి నాగంని డీల్లికి తీసుకువెళ్లి రాహుల్ తో చ‌ర్చ‌లు జ‌రిపారని తెలుస్తోంది. నాగం ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంద‌ని డికే అరుణ‌, ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి వ్య‌తిరేకిస్తున్నారు. నాగం పార్టీలోకి వ‌స్తే.. తాము, పార్టీ మారేంద‌కు అయిన సిద్దం అంటున్నారు డికే అరుణ వ‌ర్గీయులు.

జిల్లాలో గ్రూపు రాజ‌కీయ‌లు ఇంత‌గా జ‌ర‌గ‌డానికి కార‌ణం పీసీసీ ఛీప్ ఉత్త‌మ్ వైఖ‌రేనని డికే అనుచ‌రులు ఆరోపిస్తున్నారు. పార్టీలో గ్రూపు త‌గ‌దాల‌ను త‌గ్గించాల్సిన ఉత్త‌మ్.. జైపాల్ రెడ్డితో క‌లిసి ప్రొత్స‌హిస్తున్న‌ర‌నే వాదనలు వినిపిస్తున్నాయి. మ‌రి పీసీసీ ఛీప్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పాల‌మూరు నేత‌ల త‌గ‌దాల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories