సరికొత్త స్టోరీని అల్లింది..అడ్డంగా దొరికిపోయింది

Highlights

నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసును పోలీసులు చేధించారు. క్రైం కిల్లర్ సినిమాను తలపించే ట్విస్ట్‌లను క్రియేట్‌ చేసిన...

నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసును పోలీసులు చేధించారు. క్రైం కిల్లర్ సినిమాను తలపించే ట్విస్ట్‌లను క్రియేట్‌ చేసిన కిలాడి లేడి స్వాతిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు. పోలీసుల ప్రశ్నలవర్షాలకు తట్టుకోలేని స్వాతి అసలు నిజాలు చేపడంతో పాటు భర్తను చంపిన ప్రదేశాన్ని చెప్పేసింది. ప్రియుడితో కలిసి భర్త సుధాకర్‌రెడ్డి డెడ్‌బాడిని ఖననం చేసిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించింది. దీంతో నవాబుపేట మండలం ఫతేపూర్‌ అడవుల్లో సుధాకర్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇటు కొడుకు సుధాకర్ రెడ్డి మరణవార్త విన్న తల్లి సుమతి కన్నీరుమున్నీరవుతుంది. హార్ట్ పేషెంట్ అయిన తల్లి సుమతి కొడుకు లేడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తన బిడ్డ చావుకు కారణమైన స్వాతిని కఠినంగా శిక్షించాలని వేడుకుంటుంది. సుధాకర్‌ రెడ్డి సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి కేసును చేధించినట్లు సిఐ శ్రీనివాస్‌ తెలిపారు. స్వాతిని అదుపులోకి తీసుకున్నామని రాజేష్‌ చికిత్స పొందున్నందున్న అతన్ని అదుపులోకి తీసుకోలేదని పూర్తిగా కోలుకున్నాక రిమాండ్‌కు తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories