సినిమా హాల్‌లో తండ్రికి దొరికిపోయిన లవర్స్‌..!

సినిమా హాల్‌లో తండ్రికి దొరికిపోయిన లవర్స్‌..!
x
Highlights

ఫెస్టివల్ మూడ్.. పైగా సండే.. ప్రేమికులిద్దరు సరదాగా సినిమా హాల్ కు వచ్చారు. టికెట్ కూడా తీసుకున్నారు. అయితే అంతలోనే సీన్ కాస్త రివర్స్ అయింది. బ్యాడ్...

ఫెస్టివల్ మూడ్.. పైగా సండే.. ప్రేమికులిద్దరు సరదాగా సినిమా హాల్ కు వచ్చారు. టికెట్ కూడా తీసుకున్నారు. అయితే అంతలోనే సీన్ కాస్త రివర్స్ అయింది. బ్యాడ్ లక్ వెనకనే వెంటాడింది. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నారు. ఏకంగా తండ్రికే దొరికిపోయారు. తన కూతురు ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందన్న కోపాన్ని తండ్రి తట్టుకోలేక పోయాడు. అందరిముంది కన్న కూతురిని చితకబాదాడు. వరంగల్ లోని s2 సినిమా హాల్లో జరిగిన ఘటన నగరంలో చర్చనీయాంస్యమైంది. తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమికుల జంట సినిమాకు వచ్చింది. అయితే అదే సినిమాకు వచ్చిన అమ్మాయి తండ్రి వారిద్దరిని చూసి షాక్ అయ్యాడు. వెంటనే ముందే కూర్చున్న కూతురిని ఈడ్చుకుంటూ బయటకు వచ్చి తీవ్రంగా కొట్టాడు. చదువుకోమని పంపిస్తే లవర్ తో కలిసి సినిమాకు వస్తావా అంటూ ఫైర్ అవుతూ కూతురును చావబాదాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ప్రేమికుడిని కూడా చితక్కొట్టాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories