logo
తాజా వార్తలు

పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పాస్టర్‌

పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పాస్టర్‌
X
Highlights

అభం శుభం తెలియని పిల్లలు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడో పాస్టర్.. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో...

అభం శుభం తెలియని పిల్లలు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడో పాస్టర్.. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో వెలుగులోకి వచ్చింది. స్థానిక క్లౌపేటలో యూసీఎల్‌ఐ పాఠశాలలో 53 మంది పిలల్లు చదువుతున్నారు. కొంతకాలంగా 76 ఏళ్ల జోసఫ్‌ పాస్టర్‌ తమకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారంటూ పలువురు బాలికలు చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోయారు. ఆ పాఠశాలలో బాలల సంరక్షణ కమిటీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీతో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో పిల్లలను తమ అదుపులోనే ఉంచుకుంది బాలల సంరక్షణ కమిటీ. జిల్లా అధికారులతో మాట్లాడి ఒక బస్సులో వారందరినీ అధికారులు స్థానిక రామ్‌నగర్‌ మూడోలైన్‌లో ఉన్న బాలసదన్‌కు తరలించారు. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పాస్టర్ జోసఫ్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story