logo
సినిమా

తెర‌పైకి చిరు చిన్న‌ల్లుడు?

తెర‌పైకి చిరు చిన్న‌ల్లుడు?
X
Highlights

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త హీరో తెరంగేట్రం చేయ‌నున్నాడా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్...

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త హీరో తెరంగేట్రం చేయ‌నున్నాడా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. చిరు త‌రువాత నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు శిరీష్‌, వెంక‌ట్ రాహుల్ ('అలియాస్ జాన‌కి' ఫేమ్‌), సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌తేజ్ తెలుగు తెర‌పై సంద‌డి చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మ‌రో పేరు చేరుతోంది. ఈ సారి చిరంజీవి చిన్న‌ల్లుడు, శ్రీజ భర్త క‌ళ్యాణ్ తెరంగేట్రం చేయ‌నున్నార‌న్న‌ది తాజాగా వినిపిస్తున్న వార్త‌.

ఇప్ప‌టికే వైజాగ్ లో స‌త్యానంద్ వ‌ద్ద శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని.. త్వ‌ర‌లో క‌ళ్యాణ్ చిత్రం సెట్స్ పైకి వెళుతుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల క‌ళ్యాణ్ ప్ర‌త్యేకంగా ఫొటోషూట్ చేయించుకోవ‌డం కూడా ఈ వార్త‌ల‌కు బలాన్ని చేకూరుస్తోంది. త్వ‌ర‌లోనే క‌ళ్యాణ్ అరంగేట్రానికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువడుతుంది.

Next Story