logo
సినిమా

ఇక క్లాప్ కొట్టడమే

X
Highlights

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత మెగస్టార్ చిరంజీవి చేయబోయ్యే సినిమా పై అప్పుడే మెగా అభిమానులతో పాటు...

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత మెగస్టార్ చిరంజీవి చేయబోయ్యే సినిమా పై అప్పుడే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా, ఇంద్ర లాంటి కమర్సియల్ సందేశత్మాక చిత్రాల్లో నటించి మెగా అభిమానులనే కాదు టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసారు చిరు. ఇప్పుడు మరో సందేశత్మాక చిత్రాల్లో నటించబోతున్నారు.. దర్శకుడు కొరటాల శివ కూడా చిరంజీవి కోసం అటువంటి కథను సిద్ధం చేసారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’... కొరటాల దర్శకత్వం వహించిన చిత్రాలు నాలుగంటే నాలుగే. కానీ, ఇటు సందేశం, అటు కమర్షియల్ జోడించి ప్రేక్షకులు మెచ్చే విధంగా తీసారు కొరటాల. అయితే ఇప్పుడు కొరటాల మెగస్టార్ కాంబినేషన్ లొ రాబోయ్యే సినిమా ప్రీ ప్రొడక్సన్ వర్క్స్ పూర్తీ చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ సినిమా ను నిర్మించనున్నాయి. సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కూడ దాదాపు పూర్తయింది ఇక చిరు కొత్త సినిమా కు క్లాప్ కొట్టడమే తరువాయి సంక్రాంతికి సెట్స్ మీదకు వెళ్లబోతుంది చిరు కొరటాల కాంబినేషన్. చిరుని కొరటాల ఏ విధంగా చూపించబోతున్నాడో చూడాలి ఇటు మెగా అభిమానులు మాత్రం తమ స్టార్ హీరో అసలు గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు చేస్తుండం పట్ల బాగా ఖుషి అవుతున్నారు.

Next Story