గంటాకు బుజ్జగింపులు.. రంగంలోకి చినరాజప్ప

గంటాకు బుజ్జగింపులు.. రంగంలోకి చినరాజప్ప
x
Highlights

పత్రికల్లో సర్వేలు రకరకాలు వస్తుంటాయి... అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పని మనం చేసుకుపోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావుకు సూచించారు సీఎం...

పత్రికల్లో సర్వేలు రకరకాలు వస్తుంటాయి... అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పని మనం చేసుకుపోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావుకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలతో తీవ్ర అసంతృప్తికి లోనైన గంటాకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. రాజకీయాల్లో ఉంటే, ఎన్నో విషయాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయని, ఏవేవో సర్వేలు చేస్తుంటారని, అవన్నీ పట్టించుకుంటే, తాను సైతం ఒక్క పని కూడా చేయలేనని చెప్పారు. వీటిని ఫీడ్ బ్యాక్ గా తీసుకుని ముందడుగు వేయాలని గంటాకు సూచించిన చంద్రబాబు, అలా ముభావంగా ఉంటే ఎలాగని ప్రశ్నించారు. కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయని, వెంటనే ఈ అసంతృప్తి నుంచి బయటపడి, రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని సలహా ఇచ్చారని తెలుస్తోంది. అయితే, గంటా వివరణ ఇస్తూ.. తనను టార్గెట్ గా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని గంటా వాపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు హోంమంత్రి చినరాజప్ప ఇప్పటికే గంటా ఇంటికి చేరుకుని ఆయన బుజ్జగించే పనిలో పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories