మధ్యలో ఆగిన పెళ్లి కారణం ఏంటంటే!

మధ్యలో ఆగిన పెళ్లి కారణం ఏంటంటే!
x
Highlights

ఒక గంటలో పెళ్లిపందిట్లో వివాహం జరుగుతుందనగా హాఠాత్తుగా అధికారులు షాక్ ఇచ్చారు.పెళ్లి ఆపేయమని ఆదేశించారు. పెళ్ళికూతురికి మరో రెండేళ్ల వరకు పెళ్లి...

ఒక గంటలో పెళ్లిపందిట్లో వివాహం జరుగుతుందనగా హాఠాత్తుగా అధికారులు షాక్ ఇచ్చారు.పెళ్లి ఆపేయమని ఆదేశించారు. పెళ్ళికూతురికి మరో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదని రాత పూర్వకంగా రాయించుకున్నారు. ఇంతకీ ఈ స్టోరీ ఏంటంటే.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బోజ్యానాయక్‌ తండాలో బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు చైల్డ్ లైన్ ప్రతినిధులు. బోజ్యానాయక్‌ తండాకు చెందిన బాలిక తో(16) బాబునాయక్‌ తండాకు చెందిన రాథోడ్‌ రమేష్‌ అనే యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. సోమవారం పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కూతురికి మైనర్ తీరలేదని బాల్య వివాహం జరుగుతుందని చైల్డ్ లైన్ ప్రతినిధులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వెళ్లి వేదిక వద్దకు పోలీసులతో చేరుకున్నారు చైల్డ్ లైన్ బృందం, ఇది బాల్య వివాహమని, పెళ్లి జరిగితే శిక్ష తప్పదని హెచ్చరించి వివాహ వేడుక ఆపేశారు. అనంతరం పెళ్లి పెద్దలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువతీ , యువకుడిని స్థానిక తహసిల్ధార్ ఎదుట హాజరు పరిచారు. పెళ్లి కూతురి తల్లిదండ్రుల చేత మరో రెండు రెండు సంవత్సరాల వరకు వివాహం జరపకూడదని రాయించుకున్నారు. ఒకవేళ దీన్ని విస్మరిస్తే జైలు శిక్ష తప్పదని పెళ్లి కూతురు తల్లిదండ్రులను హెచ్చరించారు తహసిల్ధార్. దీంతో పెళ్ళికి వచ్చిన బంధువులు గందరగోళానికి గురయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories