వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు టిడిపివే..

వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు టిడిపివే..
x
Highlights

ఏపీ సిఎం చంద్రబాబు కష్టానికి ప్రతిరూపమే శ్వేత పత్రాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేసిన విషయం...

ఏపీ సిఎం చంద్రబాబు కష్టానికి ప్రతిరూపమే శ్వేత పత్రాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే కాగా దినికి వైసీసీ నేతలు స్పందిస్తూ చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తే తాము బ్యాక్ పేపర్లు విడుదల చేస్తామనడం హాస్యస్పాదమని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడూ రాజధాని అభివృద్థి, పోలవరానికి నిధులు ఎందుకివ్వరని ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారా? అని పుల్లారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా రానున్న ఎన్నికల్లో 150 సీట్లు తెలుగుదేశం పార్టీయేనని పుల్లారావు అన్నారు. ఎన్నికల్లో పొత్తున్నా, లేకున్నా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. తర్వలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని పుల్లారావు హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories