logo
జాతీయం

పోలింగ్ కేంద్రంలో పూజలు చేసిన బీజేపీ అభ్యర్థికి ఈసీ నోటీసు

పోలింగ్ కేంద్రంలో పూజలు చేసిన బీజేపీ అభ్యర్థికి ఈసీ నోటీసు
X
Highlights

ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ఎమ్మెల్యే ఒకరికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పోలింగ్‌ కేంద్రంలో పూజలు...

ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ఎమ్మెల్యే ఒకరికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పోలింగ్‌ కేంద్రంలో పూజలు నిర్వహించడంమే ఇందుకు కారణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నవగఢ్‌లో చోటు చేసుకుంది. చత్తీస్ ఘడ్ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి దయాళ్ దాస్ భాగేల్ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. నవాఘడ్ పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన దయాళ్ దాస్ అగర్ బత్తీలు వెలిగించి, ఈవీఎం ఉన్న టేబుల్ పై కొబ్బరికాయ కొట్టి తాను రెండో సారి విజయం సాధించాలని పూజలు చేశారు. పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి పూజలు చేసిన ఘటన గురించి తమకు తెలియగానే తాము అభ్యర్థికి నోటీసు జారీ చేశామని, అతని నుంచి సమాధానం రాగానే చర్యలు తీసుకుంటామని ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుబ్రత్ సాహూ చెప్పారు. బీజేపీ అభ్యర్థి దయాళ్ దాస్ నవాఘడ్ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

Next Story