logo
ఆంధ్రప్రదేశ్

విశాఖ కైలాస గిరిపై చిరుతల సంచారం

విశాఖ కైలాస గిరిపై చిరుతల సంచారం
X
Highlights

సాగరతీరం విశాఖలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. నిత్యం పర్యాటక ప్రియులతో కళకళలాడే కైలాసగిరిపై రెండు చిరుతలు...

సాగరతీరం విశాఖలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. నిత్యం పర్యాటక ప్రియులతో కళకళలాడే కైలాసగిరిపై రెండు చిరుతలు ప్రత్యక్షమవ్వడంతో అలజడి మొదలైంది. ఒక్కసారి ఈ న్యూస్‌ వైరల్‌ కావడంతో పర్యాటక ప్రియులు హడలిపోతున్నారు. పరిసరాలు నిర్మానుష్యంగా ఉండే తెలుగు మ్యూజియం సమీపంలో రాత్రి ఏడు గంటల సమయంలో రోడ్డుపై ఒక చిరుత పడుకొని వుండగా, మరొకటి దాని పక్కన నిలబడి వుండడాన్ని కొండపై విధులు నిర్వహించే గార్డులు చూశారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన వుడా, అటవీశాఖ అధికారులు కొండపై ఉన్న కొందరు సందర్శకులను కిందకు పంపించేశారు. చిరుతలు తిరుగుతున్నట్లు ఆనవాళ్లు కనిపించడంతో వాటిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Next Story