కర్నూల్ జిల్లాలో మహిళల్ని క్రూరంగా చంపేస్తున్నారంటూ..

కర్నూల్ జిల్లాలో మహిళల్ని క్రూరంగా చంపేస్తున్నారంటూ..
x
Highlights

ప్రశాంత వాతావరణానికి మారు పేరు పల్లె సీమలు. ఎవరైనా కొత్తవాళ్లు కనిపిస్తే కుశల ప్రశ్నలు వేసి కావాల్సిన సమాచారం, చిరునామాలు దగ్గరుండి చూపిస్తారు. కానీ...

ప్రశాంత వాతావరణానికి మారు పేరు పల్లె సీమలు. ఎవరైనా కొత్తవాళ్లు కనిపిస్తే కుశల ప్రశ్నలు వేసి కావాల్సిన సమాచారం, చిరునామాలు దగ్గరుండి చూపిస్తారు. కానీ కర్నూలు జిల్లాలో పల్లెసీమలు భయంతో వణికిపోతున్నాయి. కరుడుగట్టిన నేరస్థులు, పార్తీవ్, చెడ్డీ, బీహార్ గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయనే వదంతులతో... ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయి. పిల్లల్ని ఎత్తుకెళ్తూ.... మహిళల్ని క్రూరంగా చంపేస్తున్నారంటూ వదంతులు చెలరేగడంతో.... కొత్తవాళ్లు అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు ముందూవెనుకా చూడకుండా కుంగి బజాయిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జనం కంటి మీద కునుకు లేకుండా జాగారణ చేస్తున్నారు. రాత్రీ పగలనే తేడా లేకుండా గ్రామాల్లో కాపలా కాస్తున్నారు. ఏదైనా చిన్న అలజడి అయితే చాలు గ్రామస్తులంతా ఒకే చోటికి గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారు. కొత్త వ్యక్తులు తారసపడినా... అనుమానంగా ప్రవర్తించినా... ముందూవెనుకా చూడకుండా చావ బాదుతున్నారు. కరుడుగట్టిన నేరస్థులతోపాటు పార్తీవ్, చెడ్డీ, బీహార్ గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయనే వదంతులతో... రాత్రిళ్లు వంతుల వారీగా కాపాలా కాస్తున్నారు గ్రామస్తులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఊరిలోకి కొత్త వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో చితకబాదారు. కాళ్లూ చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. అంతేకాదు తమకు రక్షణ కల్పించాలంటూ గోనెగండ్ల రోడ్డుపై బైఠాయించారు. దాంతో గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. అయితే గ్రామస్తుల చేతిలో తన్నులు తిన్న యువకుడు యాచకుడని తేలింది. అతనిది నంద్యాల సమీపంలోని హెచ్‌.కొట్టాలగా తేలింది. మహానంది మండలం గోపవరం గ్రామంలోనూ సేమ్‌ టు సేమ్‌ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడ్ని గ్రామస్తులు పట్టుకుని చితకబాదితే.... అతడు కూడా యాచకుడని తేలింది. అయితే వదంతుల్ని నమ్మొద్దని పోలీసులు అంటున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.... పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పార్దీవ్‌, చెడ్డీ, బీహార్‌ గ్యాంగులు... కర్నూలుజిల్లాలో సంచరిస్తున్నాయనే వార్తలు ఊహజనితమేనని కొట్టిపారేస్తున్నారు. అయితే పోలీసుల మాటలను కర్నూలు జిల్లా వాసులు నమ్మడం లేదు. రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతోన్న పల్లెవాసులు.... కళ్లల్లో ఒత్తులేసుకొని మరీ కాపలా కాస్తున్నారు. కొత్తవాళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తేచాలు కుంగి బజాయిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories