“చంటిగాడు లోకల్” ఉద్యోగి

“చంటిగాడు లోకల్” ఉద్యోగి
x
Highlights

తెలంగాణా రాష్ట్రంలో నూతన జోన్లు, ఓకే అన్నాయి కేంద్ర ప్రభుత్వ జవాబులు, ఇక వస్తాయి లోకల్ కే ఎక్కువ జాబులు, ఈ ఏర్పాటుతో వస్తారు ఎక్కువ ప్రాంతీయ జవాన్లు. ...

తెలంగాణా రాష్ట్రంలో నూతన జోన్లు,
ఓకే అన్నాయి కేంద్ర ప్రభుత్వ జవాబులు,
ఇక వస్తాయి లోకల్ కే ఎక్కువ జాబులు,
ఈ ఏర్పాటుతో వస్తారు ఎక్కువ ప్రాంతీయ జవాన్లు.

తెలంగాణా రాష్ట్రంలో నూతన జోన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో, సర్కారీ కొలువులన్నీ ఇక ముందు వీటి ప్రాతిపదికనే జరగనున్నా యి. ముఖ్యంగా క్రమం తప్పకుండా జరిగే పోలీసు భర్తీలు మాత్రం కొత్త జోన్ల అనుసారం జరగనుంది. ఉమ్మడి ఎపికి రాజధానిగా వున్న హై దరాబాద్‌ చాలాకాలం పాటు ఫ్రీ జోన్‌గా వుండగా పదేళ్ల క్రితం దీనిని రద్దు చేశాక ఇతర జోన్ల తరహాలోనే పరిగణించసాగారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలో కూడా హైదరాబాద్‌ను ఎక్కడా ఫ్రీ జోన్‌గా చెప్పక పోవడంతో ఇక్కడి ఉద్యోగాలలో గెజిటెడ్‌ మినహా మిగతావన్నీ 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. మొత్తం మీద కొత్త జోన్ల ఏర్పాటుతో పోలీసు కొలువుల విషయంలో స్థానికులకు మరిన్ని అవకాశాలు వచ్చాయని చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories