వేడెక్కిన హస్తిన రాజకీయం...జాతీయ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం

x
Highlights

జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇవాళ హస్తిన వేదికగా కీలక పరిణామాలకు తెరలేవబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఈ...

జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇవాళ హస్తిన వేదికగా కీలక పరిణామాలకు తెరలేవబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఈ మధ్యాహ్నం సమావేశమవుతారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించిన చంద్రబాబు పలువురు విపక్ష నేతలతో కూడా మంతనాలు సాగిస్తారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరు..ఇందుకు కాంగ్రెస్, టీడీపీనే నిదర్శనం...అవును.. ఒకప్పుడు బద్ద విరోధులుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణలో మహాకూటమిగా ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆ స్నేహం జాతీయ రాజకీయాల్లోనూ కొనసాగబోతోంది. బీజేపీ వ్యతిరేక శక్తులతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడాలని భావిస్తున్న ఏపీ సీఎం ఇందుకోసం రాహుల్ గాంధీతో భేటీ అవుతున్నట్లు ప్రకటించారు. అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రాహుల్‌తో భేటీ అవుతున్నట్టు తెలిపారు. దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత బీజేపీ విధానాల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకు తాను బాధ్యత తీసుకున్నాని చెప్పారు.

టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశ దిశ చూపిందని, మరోసారి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు అన్నారు. అందుకే అన్ని విపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ శక్తి రూపొందిస్తామని ప్రకటించారు. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. 'సేవ్‌ నేషన్‌' పేరుతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయడంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారితో కలిసి వెళ్లే దిశగా తెలుగుదేశం అధినేత అడుగులు వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories