అనవసర రాద్దాంతం చేసి పరువు పోగొట్టుకున్నారు : సీఎం చంద్రబాబు

అనవసర రాద్దాంతం చేసి పరువు పోగొట్టుకున్నారు : సీఎం చంద్రబాబు
x
Highlights

సీఎం చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా పర్యటన పూర్తయింది. రెండు రోజులపాటు ఆ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పశ్చిమ ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన...

సీఎం చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా పర్యటన పూర్తయింది. రెండు రోజులపాటు ఆ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పశ్చిమ ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు ను సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అయన పరిశీలించారు. వచ్చే ఏడాది వెలిగొండ ప్రాజెక్టు ను ప్రారంభిస్తానని చెప్పారు. రెండో రోజు ఒంగోలులో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐఏయస్, ఐపీయస్ అధికారుల పనితీరు సరిగా లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. అలాగే ప్రకాశం జిల్లాలో నెలకొన్న పార్టీ పరిస్థితులపై సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధిలతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై ఈసమావేశంలో చంద్రబాబు నేతలకు పలు సూచనలు చేశారు.. ఇప్పటి నుంచే నేతలు గ్రామాల్లో పర్యటించి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఇక రాష్ట్ర, దేశ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. తెలంగాణలో మహాకూటమి పెడితే అక్కడి నాయకుడితో పాటు మోడీకి వణుకు పుట్టిందన్నారు. మోడీ కోడి కత్తి పార్టీతో జత కట్టాలని చూస్తున్నారు ఆరోపించారు. కోడి కత్తి విషయంలో అనవసర రాద్దాంతం చేసి పరువు పోగొట్టుకున్నారని పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories