సంక్రాంతి తర్వాత అభ్యర్థుల ప్రకటన.. తొలి జాబితాలో 100 మందికి ఛాన్స్!

సంక్రాంతి తర్వాత అభ్యర్థుల ప్రకటన.. తొలి జాబితాలో 100 మందికి ఛాన్స్!
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో మరికొద్ది గంటల్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు త్వరలోనే రానున్న...


ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో మరికొద్ది గంటల్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు త్వరలోనే రానున్న నేపథ్యంలో ఈ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. కాగా 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ప్రకటిస్తామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నేటి ఉదయం 10.30 గంటలకు జరిగే సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు, అయితే సంక్రాంతి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు తొలి జాబితాలో 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories