చైనా చైన్‌ లింక్‌... చుట్టేస్తుంది ఎవరినో తెలుసా?

చైనా చైన్‌ లింక్‌... చుట్టేస్తుంది ఎవరినో తెలుసా?
x
Highlights

చైనా బజార్... మన దేశంలో చైనా బజార్ లేని ఊరు లేదు. చైనా వస్తువులు విక్రయించని దుకాణం లేదు. చైనా కంపెనీల ధాటికి భారతీయ కంపెనీలు ఉక్కిరిబిక్కిరి...

చైనా బజార్... మన దేశంలో చైనా బజార్ లేని ఊరు లేదు. చైనా వస్తువులు విక్రయించని దుకాణం లేదు. చైనా కంపెనీల ధాటికి భారతీయ కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మనదేశం అనే కాదు....యావత్ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొందంటే నమ్మితీరాల్సిందే. అంతగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది చైనా. ఆ దేశం ధాటికి అమెరికా లాంటి అగ్రరాజ్యాలే తట్టుకోలేకపోయాయి. అందుకే చైనా దూకుడుకు కళ్ళెం వేసేందుకు నిర్ణయించుకున్నాయి. చైనా విదేశీ కార్యకలాపాలపై అవి ఓ కన్నేసి ఉంచాయి.

నిజానికి అది ఒక కన్ను కాదు...మొత్తం ఐదు నేత్రాలు...వాటినే ఫైవ్ ఐస్ గా వ్యవహరిస్తుంటారు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. చైనాకు సంబంధించిన సమాచారాన్ని ఈ దేశాలు ఒకదానితో ఒకటి షేర్ చేసుకుంటున్నాయి. జర్మనీ, జపాన్ కూడా ఈ దేశాలతో చేతులు కలిపాయి. వివిధ దేశాలను చైనా తన గుప్పిట్లోకి ఏ విధంగా తీసుకుంటున్నది, ఎక్కడెక్కడ ఎలా పెట్టుబడులు పెడుతున్నది లాంటి అంశాలపై చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్ వర్క్ ఇది. చైనాతో మిత్రత్వం ఉన్న రష్యాపై కూడా ఇవి ఓ కన్నేసి ఉంచుతున్నాయి. ఈ నెట్ వర్క్ కార్యకలాపాలు ఇటీవలి కాలంలో మరింత ఊపందుకున్నాయి.

నిజానికి ఫైవ్ ఐస్ నెట్ వర్క్ కొత్తగా ఏర్పడిందేమీ కాదు. రెండో ప్రపంచయుద్ధం అనంతరం ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనే దీనికి మూలాలున్నాయి. అప్పట్లో సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ఆ దేశ కమ్యూనికేషన్స్ ను పరిశీలించేందుకు ఒక నిఘా వ్యవస్థను ఫైవ్ ఐస్ ఏర్పాటు చేసింది. ఆ తరువాత దాన్ని ప్రజల ప్రైవేటు కమ్యూనికేషన్స్ పై నిఘా వేసేందుకు కూడా ఉపయోగించుకున్నారు. 2001 నుంచి ఇది ఇంటర్నెట్ పై కూడా నిఘా వేయడం ప్రారంభించింది. చట్టాలకు అతీతంగా ఈ నెట్ వర్క్ కార్యకలాపాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నెట్ వర్క్ చైనా పై తన దృష్టిని కేంద్రీకరించింది.
అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ ధోరణి పలు యురోపియన్ దేశాలకు నచ్చలేదు. దాంతో అవి అమెరికాకు దూరమయ్యాయి. తాజాగా ఫైవ్ ఐస్ నెట్ వర్క్ బలోపేతం కావడం ఆయా యురోపియన్ దేశాలను ఆకట్టుకోవాలని చూస్తున్న చైనాకు పెద్ద దెబ్బగానే ఉంటుంది. ఫైవ్ ఐస్ నెట్ వర్క్ లో ఫ్రాన్స్ చురుగ్గా లేనప్పటికీ, తన వంతు సహకారాన్ని మాత్రం అందిస్తోంది.

అమెరికా వ్యాపార సంస్థలు, మూవీ స్టూడియోలు, మేథో సంస్థలతో పాటుగా జర్నలిస్టులు, ప్రజలు, అధికారులను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. జర్మనీ కంపెనీలను చైనా కంపెనీలు స్వాధీనం చేసుకోవడం పెరిగిన నేపథ్యంలో జర్మన్ ప్రభుత్వం అక్కడ విదేశీ పెట్టుబడులపై కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. 2016లో జర్మన్ సెమీకండక్టర్ సంస్థ ను టేకోవర్ చేసేందుకు చైనా ప్రయత్నించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories