హైకోర్టు విభజనపై కేంద్రం గెజిట్‌ విడుదల

x
Highlights

ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 2019 జనవరి 1 నుంచి విడివిడిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. తెలంగాణకు 10మంది, ఏపీకి 16...


ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 2019 జనవరి 1 నుంచి విడివిడిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. తెలంగాణకు 10మంది, ఏపీకి 16 మంది జడ్జిలను కేటాయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ సీహెచ్. ప్రవీణ్ కుమార్, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ దామ శేషాద్రి నాయుడు , జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ టి. సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ జి.శ్యామ్ ప్రసాద్, జస్టిస్ కుమారి జే. ఉమా దేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ టి. రజనీ, జస్టిస్ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయ లక్ష్మీ, జస్టిస్ గంగారావులను ఏపికి జడ్జిలుగా కేటాయించారు.

జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ యం. సత్య రత్న శ్రీ రామచంద్రరావు, జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పొనుగోటి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరామ చౌదరి, జస్టిస్ బులుసు శివ శంకరరావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ తొడుపునూరి అమరనాథ్ గౌడ్ లను తెలంగాణకు న్యాయమూర్తులుగా కేటాయించారు. మరోవైపు ఉద్యోగుల విభజన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 1500 మంది వరకు ఉన్న ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్‌బేరర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు తదితరులను ఇరు హైకోర్టులకు కేటాయించనున్నారు. వీరి నుంచి ఆప్షన్ల స్వీకరణ కూడా పూర్తయింది. హైకోర్టు విభజనకు గెజిట్ నోటిఫికేషన్ విడదలపై టీఆర్ఎస్, టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories