రూ.371కోట్ల దుర్వినియోగం : చంద్ర‌బాబుపై సీబీఐ విచార‌ణ‌..?

రూ.371కోట్ల దుర్వినియోగం : చంద్ర‌బాబుపై సీబీఐ విచార‌ణ‌..?
x
Highlights

కాగ్ నివేదిక ఆధారంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై కేంద్రం సీబీఐ విచార‌ణ జ‌రిపించ‌నుందా..? ఎన్డీఏకి వ్య‌తిరేకంగా ఫైట్ చేస్తున్న చంద్ర‌బాబుకు బీజేపీ భ‌యం...

కాగ్ నివేదిక ఆధారంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై కేంద్రం సీబీఐ విచార‌ణ జ‌రిపించ‌నుందా..? ఎన్డీఏకి వ్య‌తిరేకంగా ఫైట్ చేస్తున్న చంద్ర‌బాబుకు బీజేపీ భ‌యం ప‌ట్టుకుందా..? నేను నిప్పే అయినా జ‌న‌సేన - బీజేపీ - వైసీపీలు త‌న‌పై కుట్ర చేస్తున్నాయ‌న్న చంద్ర‌బాబు మాటల్లో నిజ‌మెంత‌..? ఏపీలో జ‌రుగుతున్న అవినీతి గురించి చ‌ంద్ర‌బాబును సీబీఐ విచారించ‌నుందా..? అంటే అవున‌నే అంటున్నాయి సోష‌ల్ మీడియాలోని వార్త‌లు .
ఎన్డీఏ నుంచి విడిపోయిన చంద్ర‌బాబు క‌మ‌లం పార్టీ తీరును ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంద‌ని సంద‌ర్భానుసారం నొక్కాణించి చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే సీఎం చేసే వ్యాఖ్య‌ల‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం పావులు క‌దుపుతున్న‌ట్లు నేష‌న‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.
త్వ‌ర‌లో క‌ర్నాట‌క ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ప‌లికిన చంద్ర‌బాబు బీజేపీని ఓడించాల‌ని పిలుపునిచ్చారు. దీన్ని బ‌ట్టే చంద్ర‌బాబు బీజేపీ భ‌యం ప‌ట్టుకుంద‌నే ఊహాగానాలు చ‌క్కెర్లుకొడుతున్నాయి. ఇక నేను నిప్పే అయినా బీజేపీ - జ‌న‌సేన - బీజేపీలు క‌లిసి త‌న‌పై కుట్ర చేస్తున్నాయ‌ని ప‌లుమార్లు బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేశారు. మంత్రి నారాలోకేష్ అవినీతిప‌రుడంటూ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ప‌వ‌న్ ఆరోప‌ణల్ని బీజేపీ స‌మ‌ర్ధించింది. చంద్ర‌బాబు కేంద్రంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌క‌పోతే పార్టీకి తీవ్ర న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని ఏపీ బీజేపీ నేత‌లు కేంద్రానికి చెప్పిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
ఓ వైపు నేత‌ల ఫిర్యాదు , మ‌రోవైపు టీడీపీ కేంద్ర‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌దాడి పెరిగిపోతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు క‌ఠినంగా వ్య‌వ‌హరించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధ‌ప‌డిన‌ట్లు టాక్ .
దీనికితోడు పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, కేవలం మట్టి తవ్వకాలకే రూ.192కోట్లు వృథా చేశారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేశారు. కాగ్(కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక సైతం పట్టిసీమలో రూ.371కోట్లు దుర్వినియోగం అయినట్టు తెలిపింది. మొత్తం మీద కర్ణాటక ఎన్నికల తర్వాత చంద్రబాబుపై కేంద్రం సీబీఐ అస్త్రాన్ని సంధించబోతుందన్న సంకేతాలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. చంద్రబాబు కేబినెట్ లోని ఓ సీనియర్ మంత్రే స్వయంగా ఈ విషయం చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories