logo
సినిమా

తరలివచ్చిన తారాలోకం

తరలివచ్చిన తారాలోకం
X
Highlights

అందాల తార శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె నివాసం నుంచి అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న...

అందాల తార శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె నివాసం నుంచి అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (గార్డెన్‌ నంబర్‌ 5) తరలించారు. అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు శ్రీదేవి పార్థవదేహాన్ని స్పోర్ట్స్ క్లబ్‌లో ఉంచనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30గంటలకు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. విల్లే పార్లేలోని హిందూ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అంతిమయాత్రలో వివిధ చిత్రపరిశ్రమల నటీనటులు పాల్గొననున్నారు. అనంతరం 3:30 గంటలకు విల్లే పార్లేలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. మరోవైపు తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు, ముంబైకి తరలివస్తున్నారు.

చిరంజీవి, ఐశ్వర్యారాయ్‌, అనిల్‌ కపూర్‌, సంజీవ్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, ఊర్వశి రౌతెలా, ఆదిత్య ఠాక్రే, సల్మాన్‌ ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌, ఫరా ఖాన్‌, అను కపూర్‌, హేమమాలిని, ఇషా డియోల్‌, హర్షవర్ధన్‌ కపూర్‌, రవి కిషన్‌, సుభాష్‌ ఘాయ్‌, టబు, మాధురీ దీక్షిత్‌, సారా అలీ ఖాన్‌, అర్జున్‌ కపూర్‌, అక్షయ్‌ ఖన్నా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, సుస్మితాసేన్‌ తదితరులు శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు.

Next Story