బీజేపీ గ‌వ‌ర్న‌ర్ తో సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భేటీ

బీజేపీ గ‌వ‌ర్న‌ర్ తో సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భేటీ
x
Highlights

జ‌గ‌న్ - గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి ల‌కు మూడు చెరువులు నీళ్లు తాగించిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..? ఏపీకి...

జ‌గ‌న్ - గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి ల‌కు మూడు చెరువులు నీళ్లు తాగించిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..? ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై నిన‌దించ‌డానికి రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేయ‌నున్నారా..? రాజ‌కీయాల్లోకి బీజేపీ తీర్ధం పుచ్చ‌కుంటారా..? లేదంటే ఏపీ ప్ర‌భుత్వం చేసిన అవినీతిపై ఏకి పారేస్తున్న జ‌న‌సేన పార్టీలో చేరుతున్నారా..?లేదా బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారా అంటే అవున‌నే అంటున్నారు ఆయ‌న స్నేహితులు.
ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర అద‌న‌పు డీజీపీగా ఉన్న‌ ల‌క్ష్మీనారాయ‌ణ వీఆర్ఎస్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ కావాలంటూ మ‌హ‌రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఆ లేఖ‌పై స్పందించిన ఆయ‌న సన్నిహితులు, అభిమానులు ర‌క‌ర‌క‌లా అభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ద‌వీ కాలం ఉన్నా స‌డ‌న్ గా వీఆర్ఎస్ తీసుకోవ‌డంపై ల‌క్ష్మీనారాయ‌ణ త్వ‌రలో రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ఆయన స‌న్నిహితులు చెబుతున్నారు. వీఆర్ఎస్ అనంత‌రం బీజేపీలోకి గాని, జ‌న‌సేన పార్టీ తీర్ధం పుచ్చుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.
కాగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపిఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. మరోవైపు రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోటే లక్ష్మీ నారాయణ పదవీ విరమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆయన ఏ పార్టీలో చేరి ప్రజా సేవ చేస్తారనే అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. లక్ష్మీ నారాయణ బిజెపిలో చేరవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనే ఏపీ బిజెపి సిఎం అభ్యర్ధి అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ వార్తలను లక్ష్మీ నారాయణ ధృవీకరించలేదు. అయితే తాను రాజకీయాల్లోకి రావడం మాత్రం నిజం అని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. లక్ష్మీ నారాయణ జనసేనలో చేరవచ్చనే ప్రచారం కూడా ఏపీలో సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories