సీబీఐ క‌ల‌క‌లం : టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

సీబీఐ క‌ల‌క‌లం : టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్
x
Highlights

టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. విచారణ కోసం బెంగళూరుకు పిలిచి అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేశారంటూ వాకాటిపై...

టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. విచారణ కోసం బెంగళూరుకు పిలిచి అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేశారంటూ వాకాటిపై అభియోగాలున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌తో గ‌తంలో వాకాటి ఇంటిపై , ఆఫీసుల‌పై దాడులు నిర్వ‌హించింది. ఈ దాడుల్లో సీబీఐ కొన్ని డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకొని కేసు విచార‌ణ ప్రారంభించింది.
ఇదిలా ఉంటే కేసు కొన‌సాగుతుండ‌గానే వాకాటి నారాయణ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. విచారణ కోసం బెంగళూరుకు పిలిచి అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేశారంటూ వాకాటిపై అభియోగాలున్నాయి. ఐఎఫ్‌సిఐ నుంచి 180 కోట్ల రూపాయల రుణం తీసుకున్న వాకాటి శామీర్‌పేటలోని 12 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని 240 కోట్ల రూపాయల స్థలంగా చూపి రుణం పొందారని అభియోగాలున్నాయి. రుణం చెల్లించకపోవడంతో ఐఎఫ్‌సిఐ సిబిఐకి ఫిర్యాదు చేసింది. కాగా వాకాటిపై అవినితి ఆరోప‌ణ‌లు సీఎం చంద్ర‌బాబు తెలుగుదేశం పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories