Top
logo

చిదంబరం ఇంట్లో భారీ చోరీ.. దొంగలు వారే..?

చిదంబరం ఇంట్లో భారీ చోరీ.. దొంగలు వారే..?
X
Highlights

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు అయన ఇంట్లో కోట్ల రూపాయల...

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు అయన ఇంట్లో కోట్ల రూపాయల విలువచేసే ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొంగతనం జరిగిందని చిదంబరం భార్య నళిని చిదంబరం తొలుత చేసిన ఫిర్యాదును ఆదివారం రాత్రి వెనక్కి తీసుకున్నారు. తమ నివాసంలో ఎలాంటి దొంగతనం జరగలేదన్నారు.

కాగా కుటుంబసభ్యులు వేరే కార్యక్రమానికి వెళ్లడానికి ముందు నగలు అలంకరించుకునేందుకు నళిని శనివారం తన గదిలోని బీరువా తెరచిచూడగా అందులో పెట్టిన పురాతన మరకతాలు, బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు ఇంటి ప్రాంగణంలో అమర్చిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుమారు నెల క్రితం ఇద్దరు మహిళలు ముఖాలకు ముసుగేసుకుని నళిని గదిలోకి వెళ్లడం, కొద్దిసేపటి తరువాత ఒక సంచితో బయటకు వచ్చిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.

Next Story