త్వరలో ఒకరోజు ఛానళ్ల ప్రసారాలు నిలిపివేత..!

త్వరలో ఒకరోజు ఛానళ్ల ప్రసారాలు నిలిపివేత..!
x
Highlights

బ్రాడ్‌ కాస్టర్ల కోసమే రేట్లను పెంచారని కేబుల్‌ ఎమ్మెస్వోల సంఘం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో తెలుగు...

బ్రాడ్‌ కాస్టర్ల కోసమే రేట్లను పెంచారని కేబుల్‌ ఎమ్మెస్వోల సంఘం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్టీ సర్వీసెస్‌ కేబుల్‌ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా టారిఫ్‌ ఆర్డర్‌ సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించిన ఎమ్మెస్వోలు ట్రాయ్‌ విధించిన 19 రూపాయలతో పాటు అధనంగా జీఎస్టీతో విపరీతమైన భారం పడుతుందని ఉన్న ధరలకే సర్వీసు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ట్రాయ్ నిబంధనలకు నిరసగా త్వరలో ఒకరోజు ఛానళ్ల ప్రసారాలు నిలిపివేస్తామని వెల్లడించారు. ఛానెళ్ల యాజమాన్యాలు దిగిరావాలని లేకుంటే ఈ నెల 27 న ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories