ఎస్సీ, ఎస్టీలపై దాడి చేస్తే ముందస్తు బెయిల్ లేదు, అరెస్టుకు అనుమతి అక్కర్లేదు

ఎస్సీ, ఎస్టీలపై దాడి చేస్తే ముందస్తు బెయిల్ లేదు, అరెస్టుకు అనుమతి అక్కర్లేదు
x
Highlights

ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలనే కొనసాగించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ...

ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలనే కొనసాగించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న భారత్‌ బంద్‌ పాటించాలని దళిత సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దాష్టీకాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి ముందస్తు బెయిల్‌ ఇచ్చే నిబంధన తొలగించారు. అలాగే కేసు నమోదుకు ప్రాథమిక విచారణ అక్కర్లేకుండా పైగా నిందితులను ఎలాంటి అనుమతులు లేకుండా అరెస్ట్ చేయవచ్చని అందులో చేర్చింది. కాగా ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడే నిందితులకు రక్షణలు కల్పిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న చట్టంలో మార్పులు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దుచేస్తూ పాత నిబంధనలను పునరుద్ధరించాలని దళితులు కోరుతున్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో చట్టం బలహీనమైందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.కాగా ఈ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories