logo
జాతీయం

ఘోర బస్సు ప్రమాదం.. 25 మంది మృతి

ఘోర బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
X
Highlights

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాండ్య జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి......

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాండ్య జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి... పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 25 మంది చనిపోగా... మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బస్సులో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులే ఉండడంతో మృతుల్లో కూడా వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మాండ్య నుంచి పాండవపుర ప్రాంతానికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు... కనగణమరడి గ్రామంలోకి రాగానే అదుపు తప్పి కావేరి నది వీసీ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో దాదాపు 20 మంది స్కూల్ పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే బస్సు అదుపుతప్పడానికి కారణమైనమని ప్రత్యేక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

Next Story