logo
సినిమా

బ‌న్ని క్యాప్ తో డాన్స్ ఇర‌గ‌దీసాడ‌ట‌..

బ‌న్ని క్యాప్ తో డాన్స్ ఇర‌గ‌దీసాడ‌ట‌..
X
Highlights

మెగాఫ్యామిలి లో మెగాస్టార్ చిరంజీవి త‌రువాత డాన్స్ ల్లో మెద‌టిస్థానం అంటే అది అల్లు అర్జున్ కి మాత్ర‌మే...

మెగాఫ్యామిలి లో మెగాస్టార్ చిరంజీవి త‌రువాత డాన్స్ ల్లో మెద‌టిస్థానం అంటే అది అల్లు అర్జున్ కి మాత్ర‌మే ఇవ్వాలి. త‌ను డాడి చిత్రం నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌న్ని చిత్రం అంటే డాన్స్ ల‌కే పెద్ద పీట వేస్తారు. బ‌న్ని కూడా ఆ అంచ‌నాలు ఏమాత్రం త‌గ్గ‌కుండా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా ఏదో ఒక కొత్త త‌ర‌హ డాన్స్ లు చేస్తూ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేస్తూ వ‌స్తున్నాడు.
ఖైది నెంబ‌ర్ 150 లో మెగాస్టార్ చిరంజీవి షూ లేస్ క‌డుతూ స్టెప్ వేశారు.. ఇప్ప‌డు బ‌న్ని నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రం లో క్యాప్ తో ఏదో కొత్త స్టెప్ వేశాడ‌ట‌.. ల‌వ‌ర్ అల్‌సో ఫైట‌ర్ ఆల్ సో అనే సాంగ్ లో ఈ స్టెప్ వేసిన‌ట్టు తెలిసింది.. అయితే ఈ స్టెప్ ని ముందే రివీల్ చేద్దామా.. సినిమాలో స‌ర్‌ప్రైజ్ చేద్దామా అనే ఆలోచ‌న‌లో ప‌డ్డారు చిత్ర బృందం.. మ‌రోక్క సారి బ‌న్ని నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో యాక్ష‌న్ తో పాటు యూత్ కి న‌చ్చేలా డాన్స్ లు వుంటాయ‌న్న‌మాట‌..

Next Story