ప్రధానికి ఊహించని పరిణామం.. ఇద్దరు మంత్రుల రాజీనామ..

ప్రధానికి ఊహించని పరిణామం.. ఇద్దరు మంత్రుల రాజీనామ..
x
Highlights

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే విషయంలో బ్రిటన్ ప్రధాని థెరీసా మే ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా బ్రెగ్జిట్ ప్లాన్ రూపొందించండంలో...

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే విషయంలో బ్రిటన్ ప్రధాని థెరీసా మే ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా బ్రెగ్జిట్ ప్లాన్ రూపొందించండంలో కీలక పాత్ర పోషించిన మంత్రి డేవిస్‌తోపాటు, విదేశాంగ మంత్రి జాన్సన్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను దేశ ప్రధానికి సమర్పించారు. దీంతో డేవిస్‌, జాన్సన్ తీసుకున్న ఈ నిర్ణయానికి బ్రిటన్ ప్రభుత్వం షాక్ లో మునిగిపోయింది. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతున్నందున రాయితీల విషయంలోనూ అస్పష్టంగా ఉన్న వైఖరితో తాను విభేదిస్తున్నానన్నారు. ఆయన థెరేసా మే కేబినెట్ నుంచి తప్పుకుంటారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. చివరికిప్పుడు విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ కూడా రిజైన్ చేయడం జరిగిపోయాయి. ఈ పరిణామంపై స్పందించారు ప్రధాని థెరీసా మే.. రిఫరెండం తర్వాతే బ్రెగ్జిట్ ప్రక్రియ మొదలైనట్టు గుర్తుచేశారు. పలు దఫాల చర్చల తర్వాతే ఫైల్ సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. ఈయూ నుంచి విడిపోయేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసే దిశగా ఇన్నాళ్లూ డేవిస్ చేసిన కృషిని ప్రశంసించారు. కాగా బ్రిటన్ మంత్రుల రాజీనామాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆరాతీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories