logo
తాజా వార్తలు

తెల్లారితే పెళ్లి.. అంతలోనే పెళ్లి కొడుకు ఆత్మహత్య

తెల్లారితే పెళ్లి.. అంతలోనే పెళ్లి కొడుకు ఆత్మహత్య
X
Highlights

తెల్లవారితే ఆ ఇంట్లో పెళ్లి.. బంధువుల హడావుడి, చిన్నపిల్లలా ఆటపాటలతో ఇల్లంతా సందడి సందడి నెలకొంది. ఇక...

తెల్లవారితే ఆ ఇంట్లో పెళ్లి.. బంధువుల హడావుడి, చిన్నపిల్లలా ఆటపాటలతో ఇల్లంతా సందడి సందడి నెలకొంది. ఇక పెళ్లికూతురు.. తన కళ్ల ముందు మెదులుతున్న అందమైన జీవితాన్ని వూహించుకుని సంతోషపడుతోంది. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పెళ్లికొడుకుగా ముస్తాబు అవ్వాల్సిన పెళ్లికొడుకు మెడకు ఉరితాడు బిగించుకున్నాడు. దాంతో పెళ్లింట విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో జరిగింది. ఈరోజు పెళ్లి అనగా పెళ్లి కొడుకు దావూద్‌ ఖాన్‌ నిన్న రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దావూద్‌ ఖాన్‌ ఆత్మహత్యకు గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story