logo
తాజా వార్తలు

నకిరేకల్ లో దారుణం.. బాలుడిని హత్య చేసి..

నకిరేకల్ లో దారుణం.. బాలుడిని హత్య చేసి..
X
Highlights

నల్గొండ జిల్లా నకిరేకల్ లో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, ఇంటి పై...

నల్గొండ జిల్లా నకిరేకల్ లో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, ఇంటి పై కప్పుపై పడేశారు. నకిరేకల్ కు చెందిన సాత్విక్ సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించకుండా పోయాడు. దాంతో తల్లిదండ్రులు తెలిసిన వారు, బంధుమిత్రుల ఇళ్లలో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇవాళ హటాత్తుగా సాత్విక్ మృతదేహం ఇంటి పై కప్పుపై ఉన్నట్టు గుర్తించారు. దాంతో సాత్విక్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాత్విక్ ను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉందనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story