నెహ్రూ జూపార్క్‌లో బాలుడి మృతిపై టీ సర్కార్‌ సీరియస్

నెహ్రూ జూపార్క్‌లో బాలుడి మృతిపై టీ సర్కార్‌ సీరియస్
x
Highlights

పాతబస్తీ నెహ్రూ జూపార్క్‌లో బాలుడి మృతిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన...

పాతబస్తీ నెహ్రూ జూపార్క్‌లో బాలుడి మృతిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రాను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యకంగా కమిటిని ఏర్పాటు చేసి వారంలో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. నిన్న జూపార్క్‌లో రెండేళ్ల వయసున్న ఒమర్ ఆడుకుంటూ ఉండగా వేగంగా వచ్చిన బ్యాటరీ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. జూ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ ఒమర్ తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో 304 A కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేప్యధ్యంలో ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణ జరపాలంటూ ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories