logo
సినిమా

అరవిందుడికి రికార్డు స్థాయి కలెక్షన్స్..

అరవిందుడికి రికార్డు స్థాయి కలెక్షన్స్..
X
Highlights

ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా...

ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం ఇది. కాగా.. పూజా హెగ్డే హీరోయిన్. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే 165 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి తరువాతి స్థానంలో నిలిచేందుకు పరుగులు పెడుతోంది. రోజు రోజుకు కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకుండా వస్తున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరింది ఈ సినిమా. ఆంద్రా, తెలంగాణ, సీడెడ్ తో పాటు కర్ణాటకలోనూ ఈ చిత్రానికి ఎన్టీఆర్ కెరీర్లో హైయ్యెస్ట్ కలెక్షన్లు వచ్చాయి.

Next Story