మంత్రి గంటా వైసీపీలో చేరిక గురించి మా ఎంపీ చెప్పారు : బొత్స

మంత్రి గంటా వైసీపీలో చేరిక గురించి మా ఎంపీ చెప్పారు : బొత్స
x
Highlights

గతకొద్ది రోజులుగా టీడీపీలో మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.నిన్న(మంగళవారం) కేబినెట్‌ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. రేపు...

గతకొద్ది రోజులుగా టీడీపీలో మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.నిన్న(మంగళవారం) కేబినెట్‌ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. రేపు విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన ఉండగా... ఆ ఏర్పాట్లను కూడా పట్టించుకోవడం లేదు. ఉదయం నుంచి మంత్రి ఇంటికే పరిమితం అవడం... పార్టీ శ్రేణులను ఆందోళనలో పడేస్తోంది. ఈ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు త్వరలో పార్టీ మారుతారని రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.. అదికూడా ప్రతిపక్ష వైసీపీలో ఆయన చేరిక ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) వైసీపీ నేత బొత్స మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గంటా వైసీపీలో చేరుతున్నారన్న వార్తలపై అయన మాట్లాడారు. తమ పార్టీలో ఎవరు చేరాలన్న పదవులకు రాజీనామా చెయ్యాలని అన్నారు.. అలాగే ఈ విషయంపై తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలోనే చెప్పారు. కానీ గంటా శ్రీనివాసరావు చేరుతున్నట్టు సమాచారం లేదని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories