ఐసిస్‌ భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ

ఐసిస్‌ భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ
x
Highlights

దేశంలో మరోసారి రక్తపాతం సృష్టించాలన్న ఉగ్రవాదల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. రాజధాని ఢిల్లీతో పాటు యూపీలో పలు చోట్ల దాడులకు ధ్వంసరచన చేసిన టెర్రరిస్టుల...

దేశంలో మరోసారి రక్తపాతం సృష్టించాలన్న ఉగ్రవాదల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. రాజధాని ఢిల్లీతో పాటు యూపీలో పలు చోట్ల దాడులకు ధ్వంసరచన చేసిన టెర్రరిస్టుల పనిపట్టింది. దేశంలో మొత్తం 17 చోట్ల తనిఖీలు చేపట్టిన ఎన్‌ఐఏ 10 మంది ఐసిస్‌ టెర్రరిస్టులను అదుపులోకి తీసుకుంది. తనిఖీలు ఇంకా కొనసాగిస్తోంది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు దేశంలో మరోసారి తమ ఉనిఖిని చాటేందుకు చేసిన ప్రయత్నాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. ఐసిస్‌ ఉగ్రవాదులు భారత్‌లో హర్కత్‌ ఉల్‌ హర్బ్ ఇ ఇస్లాం అనే పేరుతో కొత్తశాఖను ఏర్పాటు చేసి దానిద్వారా భారీ ఆపరేషన్‌కు వ్యూహరచన చేసింది. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ ఢిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని 17 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. మొత్తం 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ విచారణ తర్వాత 10 మందిని ఐసిస్‌ ఉగ్రవాదులుగా గుర్తించి అరెస్ట్‌ చేసింది.

రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలే లక్ష్యంగా ఐసిస్ టెర్రరిస్టులు పేలుళ్లకు సిద్ధమైంది. వీరి కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఎ వారి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, రాకెట్‌ లాంచర్లు స్వాధీనం చేసుకుంది. అలాగే ఏడున్నర లక్షల నగదు, 100 మొబైల్‌ ఫోన్లు, 135 సిమ్‌కార్డులు ల్యాప్‌ట్యాప్‌, మెమోరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లభించిన ఆధారాలను బట్టిచూస్తే కొద్ది రోజుల్లోనే ఈ దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధమైనట్లు చెబుతున్నారు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో వరుస పేలుళ్లకు పాల్పడటంతో పాటు.. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా బాంబులు పేల్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని ఎన్ఐఏ తెలిపింది. అరెస్టయిన వారిలో ఇంజినీర్లు కూడా ఉన్నారని ఎన్ఐఏ ఐజీ వెల్లడించారు. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ ఈ కుట్రకు ఢిల్లీలోని ఓ మసీదులో పనిచేస్తున్న ముఫ్తీ సోహైల్‌ నాయకత్వం వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌ కోసం ఈ ముఠా విదేశీ సంస్థల సాయం కూడా తీసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది

Show Full Article
Print Article
Next Story
More Stories