బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి..

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి..
x
Highlights

రాజమహేంద్రవరం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి. ఈ ప్రమందంలో ఇద్దరు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సిటీలోని...

రాజమహేంద్రవరం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి. ఈ ప్రమందంలో ఇద్దరు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సిటీలోని ఆసుపత్రికి తరలించారు. లాలాచెరువు సుబ్బారావు నగర్‌ లోని ఓ ఇంట్లో దీపావళి కోసం బాణాసంచా తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. తీవ్ర గాయాలైన సూర్యకాంతం, ధనలక్ష్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమాదంలో కుటుంబసభ్యులు ఇద్దరు మృతిచెంది నలుగురు గాయపడటంతో ఆ ఇంట విషాదం నెలకొంది. సమాచారమునందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది మందుగుండు సామాగ్రి వల్ల జరిగిన ప్రమాదం కాదని షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగివుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories