బీజేపీ అభ్యర్థుల రెండో జాభితా ఇదే?

బీజేపీ అభ్యర్థుల రెండో జాభితా ఇదే?
x
Highlights

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో క్రమంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులతో మొదటి జాభితా విడుదల చేసిన బీజేపీ.. తాజాగా రెండో జాబితాను...

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో క్రమంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులతో మొదటి జాభితా విడుదల చేసిన బీజేపీ.. తాజాగా రెండో జాబితాను కూడా రెడీ చేసింది. నిన్న(బుధవారం) రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, మాజీ అధ్యక్షడు కిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీ దత్తాత్రేయ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 40 మందికిపైగా పేర్లతో రెండో జాబితాను రూపొందించారు. దీనిని లక్ష్మణ్‌ గురువారం ఢిల్లీ తీసుకెళ్లనున్నారు. అక్కడ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తర్వాత రెండో జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలావుంటే బీజేపీ రెండో జాభితా అంచనా ఇలా ఉంది..

ధర్మారావు (వరంగల్‌ వెస్ట్‌), అలె జితేంద్ర (మలక్‌పేట), రూప్‌రాజ్‌ (యాకత్‌పుర), ఉమా మహేందర్‌ (చార్మినార్‌), షెహజాది బేగం (చాంద్రాయణగుట్ట), హనీఫ్‌ అలీ (బహదూర్‌పుర), బల్మూరి వనిత (రామగుండం), డాక్టర్‌ శ్రీనివాస్‌ (కాగజ్‌ నగర్‌), సత్యవతి (ఖానాపూర్‌), శ్రీనివాస్‌ (చెన్నూర్‌), రంగా కిరణ్‌ (కొత్తగూడెం), ప్రహ్లాదరావు (పరిగి), శ్యామ్‌సుందర్‌ (భువనగిరి), వెంకటేశ్వర్లు (స్టేషన్‌ ఘన్‌పూర్‌), సారంగరావు (వర్థన్నపేట) దొంతిరి శ్రీధర్‌రెడ్డి (ఆలేరు), మాధవరం కాంతారావు (కూకట్‌పల్లి), బద్దం బాల్‌రెడ్డి (రాజేంద్రనగర్‌), యోగానంద్‌ (శేరిలింగంపల్లి), అశోక్‌గౌడ్‌ (ఇబ్రహీంపట్నం), పద్మజారెడ్డి (మహబూబ్‌నగర్‌), నాగూరావు నామోజీ (కొడంగల్‌), అమరేందర్‌రెడ్డి (వనపర్తి), దిలీపాచారి (నాగర్‌కర్నూల్‌), నర్సింహులు (దేవరకద్ర), స్వర్ణరెడ్డి (నిర్మల్‌), రేష్మారాథోడ్‌ (వైరా), నాగ స్రవంతి (ఇల్లందు), ప్రకాష్‌ (చేవెళ్ల).

Show Full Article
Print Article
Next Story
More Stories