Top
logo

బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కీలక నేత

బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కీలక నేత
X
Highlights

ఎన్నికలు మరో సంవత్సరంలో జరుగుతున్న వేళా ఆ పార్టీ కీలక నేత రాజీనామా చేశారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న...

ఎన్నికలు మరో సంవత్సరంలో జరుగుతున్న వేళా ఆ పార్టీ కీలక నేత రాజీనామా చేశారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న కారణంతోనే రాజీనామా చేస్తున్నట్టు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఎమ్మెల్యే పదవితో పాటు బీజేపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బక్రీద్‌ సందర్భంగా వధించేందుకు పాతబస్తీలోకి మూడు వేలకుపైగా ఆవులు, ఎద్దులు, దూడలను తీసుకువచ్చారని, వాటిని కాపాడే క్రమంలో జరగరానిది ఏదైనా జరిగితే పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్రంలో చెక్‌పోస్టుల ద్వారా గో వధను ప్రభుత్వాలు అరికట్టేవన్న రాజా సింగ్.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గోరక్షణ కోసం గొడవలు, హత్యలు జరిగాయని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కాగా రాజీనామాపై పునరాలోచించుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ను పలువురు నేతలు బుజ్జగిస్తున్నారు.

Next Story