పైనుంచి ఆదేశాలొస్తే నిమిషంలో రాజీనామాలు

పైనుంచి ఆదేశాలొస్తే నిమిషంలో రాజీనామాలు
x
Highlights

ఒక్క ఛాన్సివ్వండి.. బయటికొచ్చి టీడీపీ దుమ్ము దులుపుతామంటున్నాయి ఏపీ బీజేపీ శ్రేణులు. నాలుగేళ్లు కాపురం చేసి.. ఇప్పుడు కేంద్రంపై కారాలు మిరియాలు...

ఒక్క ఛాన్సివ్వండి.. బయటికొచ్చి టీడీపీ దుమ్ము దులుపుతామంటున్నాయి ఏపీ బీజేపీ శ్రేణులు. నాలుగేళ్లు కాపురం చేసి.. ఇప్పుడు కేంద్రంపై కారాలు మిరియాలు నూరడంపై తెలుగు తమ్ముళ్ల ఉద్దేశ్యాలను సభ పెట్టి మరీ ఉతికి ఆరేస్తామంటున్నారు. మరి.. ఏపీ బీజేపీ నేతల ఆవేశాలకు ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో..?

2014లో కలిసి పోటీ చేసి, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మిత్రుల మధ్య 2019 సమీపించే కొద్దీ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడంలో ప్రదర్శిస్తున్న అలసత్వం ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ నేరుగా అస్త్రాలను బీజేపీ వైపు ఎక్కుపెడుతుండడంతో ఏపీ కమలనాథుల్లో కలవరం మొదలైంది. తెలుగు తమ్ముళ్ల విమర్శలకు విసిగిపోయిన ఏపీ బీజేపీ నేతలు వారి పార్టీ హైకమాండ్‌కే రెండు ఆప్షన్స్‌ ఇచ్చారు. ఆదివారం విజయవాడలో పదాధికారుల సమావేశం తరువాత కమలనాథుల వ్యూహంలో మార్పు వచ్చింది. మంత్రి మాణిక్యాల రావు తెగేసి చెబుతున్నారు. పైనుంచి ఆదేశాలొస్తే నిమిషంలోనే రాజీనామాలిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీతో తెగదెంపులు చేసుకోవడమే బెటరని హైకమాండ్‌కి సూచించారు. ప్రభుత్వం నుంచి బయటకొస్తేనే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వీలవుతుందని అంటున్నారు. అప్పుడు ఏపీకి కేంద్రం ఏం చేసిందో ప్రజలకు వివరించడానికి వీలవుతుందని, అవసరమైతే ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని ఏపీకి రప్పించి బహిరంగ సభ పెడతామన్నారు. ఏపీలో బీజేపీతో టీడీపీతో పొత్తు వదులుకుంటే మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ మరొకరు వైసీపీ పార్టీ అని అర్థం ధ్వనించేలా మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి మాణిక్యాల రావు చెప్పుకొచ్చారు.

బీజేపీ మంత్రులు, కేబినెట్ నుంచి వైదొలగడం అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పబ్లిసిటీ కోసమే కొందరు ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామంటున్నారని ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని పోలవరం నిర్మాణం ఆగిందనడం అవాస్తవం అన్నారు. ఇక బీజేపీ చిత్తశుద్దిని శంకించిన ఎవరైనా దుర్మార్గులే అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్. విభజన చట్టంలోని అంశాలు అమలు చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని చెప్పారు. ఏపీని బీజేపీ అన్ని విధాల ఆదుకుంటుందని మాదవ్ అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories